కాకాణి ఎక్కడున్నారో.. లుక్ అవుట్ నోటీసులు

అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.

By Medi Samrat
Published on : 10 April 2025 2:30 PM IST

కాకాణి ఎక్కడున్నారో.. లుక్ అవుట్ నోటీసులు

అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరుకాలేదు. కాకాణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఆయన క్వాష్ పిటిషన్ ను రెండు వారాలకు వాయిదా వేసింది. కాకాణితో పాటు మరో నలుగురు నిందితులు పరారీలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే కాకాణి దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి అంతకు ముందు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన క్వాష్‌పిటీషన్‌పై విచారణను కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ ను డిస్మిస్‌ చేసింది ధర్మాసనం. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మాజీ మంత్రి కోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పుడు ఆయనతో పాటూ మరికొందరి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Next Story