Video : నీళ్లు తాగినంత ఈజీగా టీ20ల్లో సెంచ‌రీలు బాదేస్తోంది..!

హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరుగుతున్న డబ్ల్యుబిబిఎల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ లిజెల్ లీ బ్యాట్‌తో విజృభించింది.

By Medi Samrat  Published on  13 Nov 2024 3:25 PM IST
Video : నీళ్లు తాగినంత ఈజీగా టీ20ల్లో సెంచ‌రీలు బాదేస్తోంది..!

హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరుగుతున్న డబ్ల్యుబిబిఎల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ లిజెల్ లీ బ్యాట్‌తో విజృభించింది. లిజెల్ లీ సెంచ‌రీతో హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. లీ తన మునుపటి మ్యాచ్‌లో మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ సెంచ‌రీ చేసింది. ఆమె గ‌త మ్యాచ్‌లో టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు 150 పరుగులు చేసింది.

ఆసక్తికరంగా టోర్నీలో వరుసగా సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా ఆమె నిలిచింది. రనౌట్ కారణంగా ఆమె ఇన్నింగ్స్ ముగిసినప్పటికీ.. అడిలైడ్ స్ట్రైకర్స్ ఆమె దూకుడును ఆపడంలో విఫలమయ్యారు. లీ ఇన్నింగ్సులో 13 బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

లీ నిష్క్రమణ తరువాత నిక్లా కారీ 46 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఎలిస్ విల్లాని 23 ప‌రుగుల‌తో సహకారం అందించింది. హరికేన్స్ లీ జోరును సద్వినియోగం చేసుకుంది. చివరి ఐదు ఓవర్లలో 50 పరుగులు జోడించింది. చివరి ఓవ‌ర్ల‌లో కారీ ఇన్నింగ్స్‌ను వేగవంతం చేసింది. ఈ సమిష్టి కృషి ఫలితంగా హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం అడిలైడ్ స్ట్రైకర్స్ 15 ఓవ‌ర్లలో 3 వికెట్లు 118 ప‌రుగులు చేసింది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 30 బంతుల్లో 50 పరుగులు చేసింది.

Next Story