గృహ హింస కేసులో లియాండర్ పేస్‌ను దోషిగా తేల్చిన కోర్టు

Leander Paes Found Guilty Of Domestic Violence Against Partner Rhea Pillai. టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన మాజీ భాగస్వామి రియా పిళ్లైపై

By Medi Samrat  Published on  25 Feb 2022 11:20 AM GMT
గృహ హింస కేసులో లియాండర్ పేస్‌ను దోషిగా తేల్చిన కోర్టు

టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన మాజీ భాగస్వామి రియా పిళ్లైపై గృహ హింసకు పాల్పడ్డాడని ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మోడల్-నటి అయిన‌ రియా పిళ్లై 2014లో లియాండర్ పేస్‌పై గృహ హింస కేసు పెట్టారు. రియా పిళ్లై తన‌ భాగస్వామితో క‌లిసి ఉన్న ఇంటిని విడిచి వెళ్లాలని నిర్ణ‌యించుకుంటే.. ఆమెకు నెలవారీ భరణం కింద ల‌క్ష రూపాయ‌లు, నివాసానికి అద్దె రూ. 50,000 చెల్లించాలని లియాండర్ పేస్‌ను కోర్టు ఆదేశించింది.

మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్‌సింగ్ రాజ్‌పుత్ ఈ నెల ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేయ‌గా.. ఈ బుధవారం నుంచి ఉత్తర్వులు అందుబాటులోకి రానున్నాయి. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ రియా పిళ్లై 2014లో కోర్టును ఆశ్రయించారు. ఆమె ఎనిమిదేళ్ల పాటు లియాండర్ పేస్‌తో వివాహానికి సమానమైన‌ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాన‌ని కోర్టుకు తెలిపింది. లియాండర్ పేస్ చర్యలు, ప్రవర్తన ఫలితంగా తాను విపరీతమైన మానసిక హింస అనుభ‌వించాన‌ని ఆమె పేర్కొంది.

మేజిస్ట్రేట్ ఆదేశాలలో ఆమె వివిధ కార‌ణాల‌తో గృహ హింసకు కారణమైనట్లు రుజువైంది. దీంతో రియా పిళ్లైకి నెలవారీ భరణం రూ. 1 లక్ష కాకుండా నెలవారీ అద్దె రూ. 50,000 చెల్లించాలని లియాండర్ పేస్‌ను ఆదేశించింది. ఒక‌వేళ రియా పిళ్లై అదే నివాసంలో ఉండాల‌ని అనుకుంటే.. ఆమెకు ఎటువంటి ఆర్థిక‌ స‌హ‌కారం చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని కోర్టు పేర్కొంది. ఇదిలావుంటే.. లియాండర్ పేస్ టెన్నిస్ కెరీర్ దాదాపు ముగిసింది. దీంతో అత‌నికి ఈ వెసులుబాటు క‌ల్పిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.


Next Story
Share it