ముంబై ఇండియన్స్ లోకి.. మళ్లీ మలింగా
లసిత్ మలింగ.. ముంబై ఇండియన్స్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.
By Medi Samrat Published on 20 Oct 2023 7:19 PM IST
లసిత్ మలింగ.. ముంబై ఇండియన్స్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.ఇప్పుడు మరోసారి ముంబై జట్టులో భాగమవ్వనున్నాడు మలింగ. అయితే ఆటగాడిగానేమో అనే డౌట్ మీకు వద్దు. ఎందుకంటే బౌలింగ్ కోచ్ గా బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు మలింగా. ఐపీఎల్ 2024లో బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక వెటరన్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగతో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.
2009-2019 మధ్య దశాబ్దానికి పైగా ముంబై ఫ్రాంచైజీ కోసం ఆడాడు మలింగ. 2024 సీజన్ కోసం మార్క్ బౌచర్ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో చేరనున్నాడు. కోచింగ్ సిబ్బందిలో మలింగ మాజీ ముంబై ఇండియన్స్ సహచరుడు కీరన్ పొలార్డ్ కూడా ఉన్నాడు.
𝗕𝗔𝗧𝗧𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄿🄾🄻🄻🄰🅁🄳
— Mumbai Indians (@mipaltan) October 20, 2023
𝗕𝗢𝗪𝗟𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄼🄰🄻🄸🄽🄶🄰
Paltan, आता कसं वाटतय? 🤩#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan @malinga_ninety9 @KieronPollard55 pic.twitter.com/bdPWVrfuDy
"ముంబై ఇండియన్స్‌కి బౌలింగ్ కోచ్‌గా ఉండడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. MI న్యూయార్క్, MI కేప్ టౌన్ తర్వాత వన్‌ఫ్యామిలీలో నా ప్రయాణం కొనసాగుతుంది" అని మలింగ ఒక ప్రకటనలో మలింగా పేర్కొన్నాడు. "మార్క్ బౌచర్, పోలార్డ్, రోహిత్, జట్టులోని మిగిలిన వారితో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను." అని మలింగా తెలిపాడు. మలింగ 2009 నుండి ముంబై ఇండియన్స్‌తో దాదాపు 13 సంవత్సరాలు ప్రయాణించాడు. ఆటగాడిగా నాలుగు IPL టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ T20 టైటిల్స్, బౌలింగ్ కోచ్‌గా ఒక టైటిల్ అందుకున్నాడు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మలింగా పనిచేశాడు.