61 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్ మోదీ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో బ్రేకప్ మూడ్ నుంచి బయటపడి మరోసారి ఓ అందమైన మహిళపై మనసు పారేసుకున్నాడు.

By Medi Samrat  Published on  14 Feb 2025 7:19 PM IST
61 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్ మోదీ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో బ్రేకప్ మూడ్ నుంచి బయటపడి మరోసారి ఓ అందమైన మహిళపై మనసు పారేసుకున్నాడు. 61 ఏళ్ల వయసులో లలిత్ మోదీ మళ్లీ ప్రేమలో పడ్డారు. ఈరోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున లలిత్ మోదీ మరోసారి తాను క్లీన్ బౌల్డ్ అయ్యాన‌ని ప్ర‌క‌టించారు.

లలిత్ మోదీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. తన కొత్త భాగస్వామి గురించి చెప్పారు. ఎట్టకేలకు తన 25 ఏళ్ల స్నేహానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నానని లలిత్ మోదీ చెప్పారు. అయితే లలిత్ మోదీ తన భాగస్వామి ఎవరనే విషయాన్ని దాచిపెట్టారు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఫోటోను పోస్ట్ చేశాడు.

లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు.. "అవును, 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారింది. నేను మళ్లీ అదృష్టవంతుడిని.. ఇలా జరగడం ఇది రెండోసారి.. మీ అందరిలో కూడా ఇలా జరుగుతుందని ఆశిస్తున్నాను..

అంతకుముందు లలిత్ మోదీ 1991వ‌ సంవత్సరంలో మినాల్ సంగ్రానిని వివాహం చేసుకున్నారు. అతని భార్య 2018లో మరణించింది. మినల్ క్యాన్సర్ కారణంగా మరణించింది. వీరికి ఆలియా, రుచిర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.లలిత్ మోదీని మినాల్ రెండో వివాహం చేసుకున్నారు. మినాల్‌కు మొదటి వివాహం ద్వారా కరీమా అనే కుమార్తె ఉంది. లలిత్, మినాల్ మధ్య 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. వారి వివాహంలో చాలా సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే లోకాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కు కాలం నిల‌వ‌లేదు.

Next Story