పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ ఓపెనర్లు

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై విరుచుకుపడింది. పవర్ ప్లే లో 6 ఓవర్లలో 125 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్

By Medi Samrat  Published on  20 April 2024 2:40 PM GMT
పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ ఓపెనర్లు

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై విరుచుకుపడింది. పవర్ ప్లే లో 6 ఓవర్లలో 125 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 6 ఓవర్లు ముగిసే సమయానికి ఓపెనర్ ట్రేవిస్ హెడ్ 26 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలిచింది.

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఢిల్లీకి సంబంధించి ఇషాంత్ శర్మ స్థానంలో ఆన్రిచ్ నోర్జే జట్టులోకి వచ్చాడు. టాస్ కు ఐదు నిమిషాల ముందు ఇషాంత్ వీపునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందని ఢిల్లీ మేనేజ్మెంట్ తెలిపింది. టోర్నీలో ఇప్పటిదాకా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో ఆరోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీకి విజయం చాలా ముఖ్యం.

Next Story