Video : ఆర్‌సీబీ అభిమానులకు కోపం తెప్పించిన స్టార్ స్పిన్న‌ర్‌.. రియాక్ష‌న్ ఎలా ఉందంటే..?

ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి.

By Medi Samrat  Published on  25 Jan 2025 10:02 AM IST
Video : ఆర్‌సీబీ అభిమానులకు కోపం తెప్పించిన స్టార్ స్పిన్న‌ర్‌.. రియాక్ష‌న్ ఎలా ఉందంటే..?

ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ జట్టు మూడుసార్లు ఫైనల్స్ ఆడింది.. కానీ మూడుసార్లు ఓడిపోయింది. RCB అభిమానులు ట్రోఫీ కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా చూస్తున్నారు. ఈ స‌మ‌యంలో టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ RCB అభిమానుల‌ను ఇబ్బంది పెట్టే విధంగా ప్ర‌వ‌ర్తించాడు.

యూట్యూబ్ ఛానెల్‌లో ఇంట‌ర్య్యూలో కుల్దీప్ ఆర్‌సీబీ అభిమానికి బ‌దులిస్తూ.. మాట్లాడిన మాట‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. దీంతో కుల్దీప్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది.

యూట్యూబ్ లైవ్ సమయంలో ఒక RCB అభిమాని కుల్దీప్‌ను.. మీరు ఆర్సీబీ ఫ్రాంచైజీలో చేరి గోల్ కీపర్ బాధ్య‌త‌లు చేప‌ట్టండ‌ని వ్యాఖ్యానించాడు. దీనిపై కుల్దీప్ స్పందిస్తూ.. మీకు కావాల్సింది గోల్ కీపర్ కాదు బ్రదర్.. ట్రోఫీ.. అని వ్యాఖ్యానించాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కుల్దీప్‌ను ట్రోల్ చేశారు. దీనిపై కుల్దీప్ ఎక్స్‌లో స్పందిస్తూ.. చిల్ RCB ఫ్యాన్స్ ట్రోఫీ మీదే.. కానీ నేను గోల్ కీపర్ కాదు.. అని బదులిచ్చాడు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన ఫ్యాన్స్ కుల్దీప్‌ను సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు.

ఐపీఎల్ టైటిల్‌ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడు కుల్దీప్. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోగా.. కుల్దీప్ ఆ జట్టులో సభ్యుడు. అయితే ప్రస్తుతం అతడు ఉన్న జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ను గెలవలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ 2020 సంవత్సరంలో మొదటిసారి ఐపీఎల్ ఫైనల్ ఆడింది.. కానీ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.

Next Story