పాండ్యా బ్రదర్స్ ఇంట్లో ఫుల్ సందడి..
Krunal Pandya, wife Pankhuri announce birth of son Kavir. టీమిండియా ఆల్‌రౌండర్, హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు
By Medi Samrat Published on 24 July 2022 4:00 PM GMT
టీమిండియా ఆల్‌రౌండర్, హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. కృనాల్ భార్య పంఖురి శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ ట్విటర్ వేదికగా అభిమానులకు తెలియజేశాడు. భార్య పంఖురి చేతిలో ఒదిగిన బిడ్డను ముద్దాడుతూ దిగిన ఫోటోను కృనాల్ ట్విటర్‌లో షేర్ చేశాడు. 'కవిర్ కృనాల్ పాండ్యా' అంటూ ఫోటోకు క్యాప్షన్‌ను ఇచ్చాడు. కృనాల్-పంఖురిలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు.
కృనాల్, పంఖురి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం డేటింగ్ చేసిన తర్వాత డిసెంబర్ 2017 లో వివాహం చేసుకున్నారు. 2017 IPL ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ (MI) తరపున మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన తర్వాత క్రునాల్ పంఖురికి ప్రపోజ్ చేసినట్లు ఈ జంట ఒకసారి వెల్లడించారు. కృనాల్ చివరిసారిగా 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో క్రికెట్ మైదానంలో కనిపించాడు. టీమిండియా తరఫున 19 టీ20లు, 5 వన్డేలు ఆడిన కృనాల్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు వలస వెళ్లాడు. అతను ఇటీవలే ఇంగ్లీష్ కౌంటీ జట్టైన వార్విక్‌షైర్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు.