ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో 15వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 3న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదికవ్వనుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోయిన ఈ రెండు జట్లు విజయం కోసం ఈ మ్యాచ్ లో పోరాడనున్నాయి.
టోర్నమెంట్‌లో ఇప్పటివరకు కోల్‌కతా, హైదరాబాద్ జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో 28 మ్యాచ్‌లలో 18 మ్యాచ్‌లలో KKR విజయం సాధించి ఆధిపత్యం చెలాయించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది, అందులోనూ KKR సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో KKR పది మ్యాచ్‌లలో ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించి ఆధిపత్యాన్ని కలిగి ఉంది. మ్యాచ్ 7:30 నిమిషాలకు మొదలవ్వనుంది.