మూడోసారి చాంపియన్‌గా నిలిచిన‌ కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2024 చివరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైద‌రాబాద్‌ మధ్య జరిగింది.

By Medi Samrat  Published on  27 May 2024 2:07 AM GMT
మూడోసారి చాంపియన్‌గా నిలిచిన‌ కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2024 చివరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైద‌రాబాద్‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 114 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం కోల్‌కతా 10.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఎనిమిది వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది.

ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. లక్ష్యాన్ని ఛేదించిన కోల్‌కతా.. వెంకటేష్ అయ్యర్, గుర్బాజ్ అహ్మద్‌ల అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ అద్భుత ప్రదర్శన చేసింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైద‌రాబాద్‌ జట్టును ఏ సమయంలోనూ ఆధిపత్యం చెలాయించనివ్వలేదు. కోల్‌కతా గతంలో 2014 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తన చివరి టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కోల్‌కతా జట్టు మళ్లీ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Next Story