కొహ్లీ-రూట్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?

Kohli, Root had a heated exchange. లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘోరంగా ఓటమిపాలైంది

By Medi Samrat  Published on  25 Aug 2021 12:33 PM GMT
కొహ్లీ-రూట్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?

లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘోరంగా ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ కోహ్లి, ఇంగ్లండ్‌ కెప్టెన్ రూట్‌ మధ్య వాడివేడి వాగ్వాదం జరిగిందని అంటున్నారు. లార్డ్స్ పెవిలియన్ లాంజ్ రూమ్ వేదికగా ఈ గొడవ జరిగినట్లు సమాచారం. ఇరు జట్ల ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లినట్లు బ్రిటిష్‌ మీడియా కథనాలను ప్రసారం చేసింది. కోహ్లి, రూట్‌ దాదాపు కొట్టుకునే దాకా వెళ్లిందని కథనాలు వచ్చాయి. రెండో టెస్ట్‌ మూడో రోజు అండర్సన్‌ను టార్గెట్‌గా చేసుకుని బుమ్రా వరుసగా షార్ట్ పిచ్ బంతులను వేయడంతో.. అండర్సన్ నోటికి పని చెప్పాడు. అప్పటి నుండి మైదానంలో కూడా స్లెడ్జింగ్ వరకూ వెళ్ళింది. మ్యాచ్‌ పూర్తయ్యేవరకూ ఇరు జట్ల మధ్య ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఓటమి పాలయ్యే స్థితి నుండి భారత్ తేరుకుని.. 151 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును ఓడించింది.

ఇంగ్లండ్ తో జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ ఇప్పటికే 1-0 తో లీడ్ లో ఉంది. లీడ్స్‌ వేదికగా నేడు మూడో టెస్ట్‌ మొదలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీమిండియా రెండో టెస్ట్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగగా, ఇంగ్లండ్‌ జట్టు రెండు మార్పులు చేసింది. ఓపెనర్‌ సిబ్లే స్థానంలో డేవిడ్‌ మలాన్‌ జట్టులోకి రాగా, గాయపడిన మార్క్‌ వుడ్‌ స్థానంలో క్రెయిగ్‌ ఓవర్టన్‌ వచ్చాడు. తొలి సెషన్ లో అండర్సన్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. రాహుల్, పుజారా, కెప్టెన్ కోహ్లీని పెవిలియన్ కు పంపాడు.


Next Story
Share it