బెంగళూరు, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ తో గొడవకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లక్నో ఇన్నింగ్స్ 16వ ఓవర్ పూర్తయిన సమయంలో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం రాజుకుంది. దాన్ని అంపైర్, మిశ్రా ఆపాలని చూశారు. మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య గొడవకు కారణమైంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సహచర ఆటగాళ్లు వారిద్దరిని విడదీశారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గంభీర్, కోహ్లీలకు 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు. నవీనుల్ హక్ కు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. ఈ గొడవకు కారణం.. మ్యాచ్ సమయంలో నవీనుల్ హక్ బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ వ్యవహరించిన తీరే అని కొందరు అంటున్నారు.
నవీనుల్ హక్ వైపు దూసుకెళ్లిన కోహ్లీ ‘నువ్వు నా కాలికి ఉన్న దుమ్ముతో సమానం’ అన్నట్లు సంజ్ఞ చేశాడు. అంపైర్లు, అమిత్ మిశ్రా కలగజేసుకోవడంతో ఏదో అనుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ తీరుపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ అలా వ్యవహరించాల్సింది కాదని అంటున్నారు.