కేప్ టౌన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు దేశ జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆదివారం 'గమ్ నమలడం'పై సోషల్ మీడియాలో వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో అతడి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మూడో వన్డే ప్రారంభానికి ముందు ఇరు జట్లు జాతీయ గీతాలు ఆలపించేందుకు మైదానంలోకి దిగాయి. భారత జాతీయ గీతం ప్రారంభం కాగానే, కెమెరా విరాట్‌పై ఫోకస్ చేయబడింది. మధ్యమధ్యలో గమ్ నములుతూ పాడుతూ విరాట్ కోహ్లీ కనిపించాడు. విరాట్ కోహ్లీ చేసిన ఈ చర్యను భారత అభిమానులు రికార్డ్ చేశారు. జాతీయ గీతాన్ని అగౌరవపరిచారంటూ సోషల్ మీడియాలో కోహ్లిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
"జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు విరాట్ కోహ్లి ఏదో నమలుతూ బిజీగా ఉన్నాడు. దేశ రాయబారి. @బీసీసీఐ" అని ఒక అభిమాని ట్విట్టర్‌లో వీడియోతో రాశారు. మరొక నెటిజన్.. ఇలాంటి యూత్ ఐకాన్‌లు మనకు అవసరమా?.. అంటూ రాశారు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు వన్డేల్లో కూడా విరాట్ డకౌట్ అయ్యాడు. అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకున్న విరాట్.. ప్రస్తుతం టీమిండియా జట్టులో పూర్తి స్థాయి బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నారు. గీతాలపన చేస్తున్న సమయంలో విరాట్ చుయింగ్ గమ్ నములుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో ముగించింది. వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ కూడా భారత్ ఓడిపోయింది.