సచిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన విరాట్ కోహ్లీ

Kohli Breaks Sachin Record. ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో బాగంగా ఆఖ‌రి వ‌న్డే కాన్‌బెర్రాలో

By Medi Samrat  Published on  2 Dec 2020 5:28 AM GMT
సచిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో బాగంగా ఆఖ‌రి వ‌న్డే కాన్‌బెర్రాలో జ‌రుగుతుంది. ఈ మ్యాచ్‌లో భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లి ఈ ఫీట్‌ సాధించాడు.

కోహ్లీకి ఇది 251వ వ‌న్డే. కోహ్లీ ఈ మ్యాచ్‌లో 23 ప‌రుగుల మార్కు దాట‌గానే.. 242వ ఇన్నింగ్స్‌లో 12 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. అదే ఈ ఘ‌న‌త‌ను స‌చిన్ అందుకోవ‌డానికి 309 మ్యాచ్‌లు, 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఆ లెక్క‌న మాస్ట‌ర్ బ్లాస్టర్ కంటే ఎంతో ముందుగానే విరాట్ ఈ మార్క్‌ను చేర‌నున్నాడు. ఇద్దరి మధ్య 50కిపైగా వన్డేలు తేడాలు ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే వ‌న్డేల్లో 12 వేల ప‌రుగులు చేసిన వాళ్ల‌లో విరాట్ కోహ్లీ ఆరో ప్లేయ‌ర్‌గా నిల‌వ‌నున్నాడు. ఇంత‌కు ముందు స‌చిన్ ‌టెండూల్క‌ర్‌తో పాటు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)‌, కుమార సంగ‌క్క‌ర (శ్రీలంక)‌, స‌నత్ జ‌య‌సూర్య‌ (శ్రీలంక)‌, మ‌హేల జ‌య‌వ‌ర్దనె (శ్రీలంక)‌ కూడా వ‌న్డేల్లో 12 వేల ప‌రుగులు సాధించిన జాబితాలో ఉన్నారు. 12 వేల ప‌రుగులకు పైగా చేసిన వాళ్లలో ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు ఉండడం విశేషం.

ఇదిలావుంటే.. ఆసీస్‎తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (16) ఔటయ్యాడు. అగర్‌కు క్యాచ్‌ ఇచ్చి ధావన్ పెవిలియన్‌కు దారిపట్టాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ (33) కూడా అగర్ బౌలింగ్‎లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో భారత్ 82 పరుగులకే రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (36) రన్స్, అయ్యర్ (14) పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లను కోల్పోయి 104 పరుగులు చేసింది.


Next Story