కోహ్లీ మరో 23 పరుగులు చేస్తే..
Kohli 23 runs away from breaking Sachin Tendulkar’s massive record. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను కోహ్లీ సేన ఓటముల
By Medi Samrat Published on 1 Dec 2020 4:44 PM ISTసుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను కోహ్లీ సేన ఓటములతో మొదలు పెట్టింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే చేజార్చుకుంది. ఇక ఆఖరి వన్డే కాన్‌బెర్రాలో బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 23 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత ప్లేయర్‌గా నిలుస్తాడు.
కోహ్లీకి ఇది 251వ వన్డే. ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేస్తే.. 242వ ఇన్నింగ్స్‌లోనే 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అదే ఈ ఘనతను సచిన్ అందుకోవడానికి 309 మ్యాచ్‌లు, 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఆ లెక్కన మాస్టర్ బ్లాస్టర్ కంటే ఎంతో ముందుగానే విరాట్ ఈ మార్క్‌ను చేరనున్నాడు. ఇద్దరి మధ్య 50కిపైగా వన్డేలు తేడాలు ఉన్నాయి. కోహ్లీ ఒకటి లేదా రెండు వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన వాళ్లలో విరాట్ కోహ్లీ ఆరో ప్లేయర్‌గా నిలవనున్నాడు.
ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్‌తో పాటు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), కుమార సంగక్కర (శ్రీలంక), సనత్ జయసూర్య (శ్రీలంక), మహేల జయవర్దనె (శ్రీలంక) కూడా వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన జాబితాలో ఉన్నారు. 12 వేల పరుగులకు పైగా చేసిన వాళ్లలో ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు ఉండడం విశేషం.