Video : మరీ ఇంత దారుణంగా అవుట్ అవుతారా.. కేఎల్ రాహుల్ కు ఏమైంది..?
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్ అత్యంత చెత్తగా అవుట్ అయ్యాడు.
By Medi Samrat Published on 8 Nov 2024 5:36 PM ISTమెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్ అత్యంత చెత్తగా అవుట్ అయ్యాడు. ఇప్పటికే సరైన ఫామ్ లేక సతమతమవుతున్న రాహుల్ దారుణంగా బౌల్డ్ అయ్యాడు. తన ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా ప్రారంభించి 43 బంతుల్లో 10 పరుగులు చేశాడు. అయితే కోరీ రోచిక్సియోలీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. బౌల్డ్ అవ్వడం బాధ కలిగించడం లేదు.. అయిన విధానం భారత క్రికెట్ జట్టు అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తోంది.
"Don't know what he was thinking!"
— cricket.com.au (@cricketcomau) November 8, 2024
Oops... that's an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz
లెగ్ సైడ్ వచ్చిన బంతిని ఆడడానికి బ్యాక్‌ఫుట్‌పైకి వచ్చిన రాహుల్ షాట్ ఆడకుండా ఆగిపోయాడు. ఫలితంగా, బంతి అతని ఎడమ ప్యాడ్‌కు తగిలి ఆఫ్ స్టంప్‌ను తాకింది. దీంతో రాహుల్ కేవలం 10 (44) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో, రాహుల్ కేవలం 4 (4) పరుగులకే ఔట్ అయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జిమ్మీ పీర్సన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రాహుల్ ఫామ్ భారత టెస్ట్ జట్టుకు ఆందోళన కలిగిస్తుంది, రాహుల్ ను ఇప్పటికే న్యూజిలాండ్ తో చివరి రెండు టెస్టులకు తొలగించారు. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఆడాడు. 2022 నుండి, రాహుల్ 12 మ్యాచ్‌లలో (21 ఇన్నింగ్స్‌లు) 25.7 సగటుతో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో 514 పరుగులు మాత్రమే చేశాడు.