పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ఆసుపత్రి పాలయ్యాడు. కడుపులో నొప్పి రావడంతో అతడిని గత ఆసుపత్రికి తరలించినట్లు జట్టు యాజమాన్యం చెబుతోంది. అతడిని పరీక్షించిన వైద్యులు అపెండిసైటిక్స్ అని చెప్పారని పంజాబ్ కింగ్స్ జట్టు ట్విట్టర్ లో తెలిపింది. అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ చెప్పుకొచ్చింది. వీలైనంత త్వరగా రాహుల్ కోలుకుంటారని ఆశిస్తూ ఉన్నామని తెలిపారు. రాహుల్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతూ ఉన్నాడు. 7 మ్యాచ్ లు ఆడిన రాహుల్ 66.20 యావరేజ్ తో 331 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతూ ఉంది. 7 మ్యాచ్ లలో మూడు విజయాలను అందుకుంది పంజాబ్ కింగ్స్. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ రాహుల్ మీద ఎంతగానో ఆధారపడి ఉంది. అలాంటిది రాహుల్ ఆసుపత్రి పాలవ్వడంతో అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్ ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కె.ఎల్. రాహుల్ ఆడడం లేదు. ఎన్ని మ్యాచ్ లకు రాహుల్ దూరమవుతాడన్న విషయంపై క్లారిటీ లేదు.