ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన విధ్వంసకర ఆల్‌రౌండర్

Kieron Pollard Announces Retirement From Playing IPL. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat
Published on : 15 Nov 2022 3:25 PM IST

ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన విధ్వంసకర ఆల్‌రౌండర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబై ఇండియ‌న్స్ కు 13 సీజన్‌లు ఆడిన పోలార్డ్.. రిటైర్మెంట్ నిర్ణ‌యం నిజంగా అభిమానుల‌ను విస్మ‌యానికి గురిచేసింది. ఈ మేరకు మంగళవారం ట్విటర్ వేదికగా పొలార్డ్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. ఫ్రాంచైజీలు రిటెన్షన్ ప్లేయర్‌ల జాబితాను సమర్పించడానికి నవంబర్ 15 చివరి రోజు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌ 2023 మినీ-వేలానికి ముందే పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ధన్యవాదాలు తెలిపిన పొలార్డ్.. కెరీర్ పట్ల గర్వంగా ఉందన్నాడు. ముంబై ఇండియన్స్ కి గుడ్ బై చెప్పడం ఎమోషనల్ గా ఉంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో చర్చల తర్వాత ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాను. ఇక, కొనాళ్లు ఆడాలనుకున్నాను. కానీ, ప్రస్తుత ఫామ్ రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే, వేరే జట్టుకు ఆడదల్చుకోలేదు. ముంబై ఇండియన్ గానే రిటైర్ అవ్వాలనుకున్నాను. అలాగే.. బ్యాటింగ్ కోచ్ గా, ముంబై ఎమిరేట్స్ ప్లేయర్ గా ఈ ఫ్రాంచైజీతో నా అనుబంధం కొనసాగుతుంది. ఇనాళ్ల ఐపీఎల్ కెరీర్ లో నాకు సహకరించిన ఫ్రాంచైజీ, కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్లు, మేనేజర్లకు ధన్యావాదాలు తెలుపుతున్నాను. అలాగే, చివరగా నా ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు కూడా ధన్యవాదాలు.. అంటూ పొలార్డ్ ట్వీట్ చేశాడు.

క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో ఆడిన అత్యుత్తమ విదేశీ ఆటగాళ్లలో పొలార్డ్ ఒకడు. పొలార్డ్ ముంబై ఇండియ‌న్స్ టైటిల్స్ సాధించిన 5 ఐపీఎల్‌లు, 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలలో కీలక పాత్ర పోషించాడు. పొలార్డ్ తన కెరీర్‌లో మొత్తం 189 IPL మ్యాచ్‌లు ఆడాడు. 147.32 స్ట్రైక్ రేట్‌తో 3412 పరుగులు చేశాడు. పొలార్డ్ గత సీజన్‌లో ముంబై తరపున 11 మ్యాచ్‌లలో 107.46 స్ట్రైక్ రేట్‌తో కేవలం 144 పరుగులు మాత్ర‌మే చేశాడు.




Next Story