ఢిల్లీ క్యాపిటల్స్ లో నయా జోష్.. ఆయనే మెంటార్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో తమ జట్టు మెంటార్‌గా మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.

By Medi Samrat  Published on  27 Feb 2025 7:55 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్ లో నయా జోష్.. ఆయనే మెంటార్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో తమ జట్టు మెంటార్‌గా మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. అత్యంత డిమాండ్ ఉన్న మాజీ ఆటగాళ్ళలో ఒకరి పునరాగమనాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది.

కెవిన్ పీటర్సన్ కొత్త సీజన్ కోసం ఎంపికైన ప్రధాన కోచ్ హేమంగ్ బదానీతో కలిసి పని చేస్తాడు. IPL 2024 సీజన్ ముగింపులో రికీ పాంటింగ్‌తో విడిపోయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందాన్ని పూర్తిగా మార్చుకుంది. గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో మంచి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ భారత ఆల్ రౌండర్ బదానీ సారథ్యంలో మొదటి టైటిల్ ను సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ఉంది. ఐపీఎల్‌లో కెవిన్‌ పీటర్సన్‌కి కోచ్‌ రోల్‌ గా ఇదే తొలిసారి. పీటర్సన్ చివరిసారిగా 2016లో ఐపీఎల్ లో ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే సీజన్‌కు తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌కి క్రికెట్ డైరెక్టర్‌గా వేణుగోపాలరావు, బౌలింగ్‌గా మునాఫ్ పటేల్ ఉన్నారు.

Next Story