అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ కేదార్ జాదవ్

T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు జూన్ 5న‌ ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించనుంది.

By Medi Samrat  Published on  3 Jun 2024 10:42 AM GMT
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ కేదార్ జాదవ్

T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు జూన్ 5న‌ ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించనుంది. ఈ మెగా ఈవెంట్‌లో యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం కల్పించారు. భారత సెలక్టర్లు ప్రతి ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లకు ఎక్కువ‌గా అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు టీమ్ ఇండియా జ‌ట్టులో ఎంట్రీకి తలుపులు మూత‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు కేదార్‌ రిటైర్మెంట్ ప్రకటించాడు.

కేదార్ జాదవ్ తన రిటైర్మెంట్ గురించి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తన రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తూ.. నన్ను ఆదరించినందుకు.. ప్రేమిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని రాశాడు. నేను క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌ల నుండి రిటైర్ అవుతున్నాన‌ని వెల్ల‌డించాడు.

కేదార్ జాదవ్ 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అతను 16 నవంబర్ 2014న రాంచీలో శ్రీలంకతో తన మొదటి ODI ఆడాడు. చివరి ODI మ్యాచ్‌ని 8 ఫిబ్రవరి 2020న న్యూజిలాండ్‌తో ఆడాడు. కేదార్ మొత్తం 73 మ్యాచ్‌లు ఆడి వన్డేల్లో 1,389 పరుగులు చేశాడు. కెరీర్‌లో 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు చేశాడు. బౌలింగ్‌లో 27 వికెట్లు కూడా పడగొట్టాడు. టీ20ల‌లో కేదార్ 9 మ్యాచ్‌లు ఆడి 122 పరుగులు చేశాడు. IPL లో కేదార్ జాదవ్ మొత్తం 95 మ్యాచ్‌లు ఆడి 1,208 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Next Story