Video : రూ. 14 కోట్ల బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా ఐదోసారి అట్ట‌ర్‌ ప్లాప్‌.. హద్దులు దాటిన‌ కావ్య కోపం

ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు చాలా నిరాశాజనకంగా ఉంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం గుజరాత్ టైటాన్స్ చేతిలో మరో 20 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

By Medi Samrat
Published on : 7 April 2025 2:00 PM IST

Video : రూ. 14 కోట్ల బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా ఐదోసారి అట్ట‌ర్‌ ప్లాప్‌.. హద్దులు దాటిన‌ కావ్య కోపం

ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు చాలా నిరాశాజనకంగా ఉంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం గుజరాత్ టైటాన్స్ చేతిలో మరో 20 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ఆరెంజ్ ఆర్మీకి ఇది వరుసగా నాలుగో ఓటమి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరుతో టీమ్ ఓనర్ కావ్య మారన్ కూడా చాలా నిరాశకు గురయ్యారు. 14 కోట్లు ధ‌ర‌కు కొన్న‌ అభిషేక్ శర్మ వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఫ్లాప్ కావడంతో కావ్య మారన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని అభిషేక్ శర్మ మిడ్ ఆన్ వైపు ఆడ‌గా రషీద్ ఖాన్ క్యాచ్ పట్టాడు. క్యాచ్ ప‌ట్టిన‌ వెంటనే కెమెరాను కావ్య మారన్ వైపు తిప్పాడు కెమెరామెన్‌. ఈ స‌మ‌యంలోకోపంతో ఉన్న‌ కావ్య ఏదో మాట్లాడింది. కావ్య మారన్ ఆగ్రహంతో స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుత ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ ప్రదర్శన అంత‌గా బాగాదు. అభిషేక్ శర్మ వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌ల‌లో 24, 6, 1, 2, 18 ప‌రుగులు చేశాడు. 5 మ్యాచ్‌ల్లో మొత్తం 51 పరుగులు చేశాడు. టోర్నీలో హైదరాబాద్ ప్రదర్శన కూడా నిరాశపరిచింది. ఆరెంజ్ ఆర్మీ ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడింది. ప్రారంభ మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది.

గుజరాత్ టైటాన్స్‌తో తమ సొంత గడ్డపై జ‌రిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ నష్టాన్ని చవిచూసింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో అంటే 10వ స్థానంలో నిలిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్‌కు ఇది మూడో విజయం కాగా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అగ్రస్థానంలో ఉంది.

Next Story