కావ్య కు ప్రపోజ్ చేసిన సఫారీ ఫ్యాన్.. మేం కూడా లైన్‌లో ఉన్నామంటున్న భారత అభిమానులు
Kaviya Maran gets marriage proposal from a South African fan during SA20 match.కావ్య మారన్.. పరిచయం చేయాల్సిన పని
By తోట వంశీ కుమార్ Published on 20 Jan 2023 2:28 PM ISTకావ్య మారన్.. పరిచయం చేయాల్సిన పని లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చూసే వారికి బాగా తెలుసు. సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సీఈఓ అయిన కావ్య మారన్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్లు తలదన్నె అందం ఆమె సొంతం. దీంతో ఆమె అంటే కుర్రకారు పడి చస్తారు. ఇక హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు కావ్య రావడం.. ఆమె ఇచ్చే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం మామూలే. కావ్య కోసమైనా సన్‌రైజర్స్ గెలవాలని కోరుకునే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.
తాజాగా మరోసారి కావ్య మారన్ పేరు మారుమోగిపోతుంది. ఓ అభిమాని తనను పెళ్లి చేసుకుంటావా..? అని ఫ్లకార్డుతో మ్యాచ్ జరుగుతుండగా ప్రప్రోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండియాలో ఐపీఎల్ లాగానే దక్షిణాఫ్రికాలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరిట టీమ్‌ను కొనుగోలు చేసింది హైదరాబాద్ జట్టు యాజమాన్యం. ఈ జట్టుకు కూడా కావ్య మారనే సీఈవోగా వ్యవహరిస్తుంది. దీంతో అక్కడ కూడా ఆ టీమ్ ఆడుతున్న మ్యాచ్‌లకు వెలుతోంది.
గురువారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన పార్లే రాయల్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌కు హాజరైన కావ్య స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఉత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు వచ్చిన ఓ ప్రేక్షకుడు.. కావ్యా మారన్.. నువ్వు నన్ను పెళ్లిచేసుకుంటా..? అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ఫ్లకార్డును ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్ ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది.
Looks like someone needs a bit of help from @Codi_Yusuf on how to propose in the BOLAND. 💍#Betway #SA20 | @Betway_India pic.twitter.com/ZntTIImfau
— Betway SA20 (@SA20_League) January 19, 2023
ఈ వీడియోపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా కావ్య మేడమ్ కే లైన్ వేస్తా..? ఆమెకు చాలా దూరంగా ఉండూ..? లేదంటే నీ సంగతి చూస్తాం..? అంటూ పలువురు నెటీజన్లు సరదాగా కామెంట్లు పెట్టగా.. ఇంకొందరు.. మేడమ్ అందం అలాంటిది..? ఇందులో అతడి తప్పు ఏముంది..? మేడమ్ సార్.. మేడమ్ అంతే అని అంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల గెలిచింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ మూడు విజయాలు సాధించింది.