నా ఇన్నింగ్స్ గురించి మాట్లాడి ఎటువంటి ప్రయోజనం లేదు

IPL 2025లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది.

By Medi Samrat
Published on : 14 April 2025 11:16 AM IST

నా ఇన్నింగ్స్ గురించి మాట్లాడి ఎటువంటి ప్రయోజనం లేదు

IPL 2025లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. క‌రుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 205 పరుగులు చేసింది. అనంత‌రం ఢిల్లీ జట్టు 193 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయ‌ర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అద్భుతమైన పునరాగమనంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. కరుణ్ 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 89 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత అతను ఏం మాట్లాడాడో తెలుసుకుందాం.

మేము మ్యాచ్‌లను గెలవడానికే ఆడతాము కాబట్టి నిరాశ ఉంది.. జట్టు గెలవకపోతే మేము ఎంత స్కోర్ చేసినా ఏమీ అర్థం కాదు. నాకు జట్టు విజయం చాలా ముఖ్యం.. అది జరగలేదు.. ఈ ప‌రాజ‌యం నుంచి నేర్చుకుని.. మేము ముందుకు వెళ్తాము.. నేను ఇలాగే ప్రదర్శనను కొనసాగిస్తా.. మేము గెలుస్తామని ఆశిస్తున్నాను. నా ఇన్నింగ్స్ గురించి మాట్లాడి ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే నేను బాగా ఆడాను.. కానీ నేను పూర్తి చేయలేకపోయాను.. అది నిరాశపరిచిందన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.. తదుపరి 73 పరుగులకు 9 మంది బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరారు. వరుసగా వికెట్ల పతనం కారణంగా మ్యాచ్ మలుపు తిరిగింద‌ని కరుణ్ చెప్పాడు. ఆతిథ్య జట్టును ఒత్తిడికి గురిచేసిన ముంబై బౌలర్లను కొనియాడాడు. కొత్త బ్యాట్స్‌మెన్ కంటే సెట్ బ్యాట్స్‌మెన్ ఆడడం చాలా తేలికని.. కాబట్టి సెట్ బ్యాట్స్‌మన్ ఆటను కొనసాగించడం చాలా ముఖ్యం. మేము నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయాము, చివరికి మాకు కష్టమైంది. ముంబై బౌల‌ర్లు కూడా బాగా బౌలింగ్ చేసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యమైన భాగస్వామ్యాలను నిర్మించడంలో మేము విజయవంతం కాలేకపోయామన్నాడు.

విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కరుణ్‌ను.. తొలి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌పైనే ఉంచింది ఢిల్లీ. అయితే ఐదవ మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో అతనికి అవకాశం లభించింది. గాయపడిన ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో అతనికి అవకాశం కల్పించారు.

Next Story