కిల్లర్ బౌన్సర్‌తో కంగారెత్తించిన త్యాగి.. ఆసీస్ బ్యాట్స్‌మెన్ 'హర్ట్'
Kartik Tyagi bouncer hits Australia opener Will Pucovski. అండర్ 19 వరల్డ్ కప్‌లో అదరగొట్టి.. ఐపీఎల్‌లోనూ సత్తా
By Medi Samrat
అండర్ 19 వరల్డ్ కప్‌లో అదరగొట్టి.. ఐపీఎల్‌లోనూ సత్తాచాటిన కార్తీక్ త్యాగి ఆసీస్ గడ్డపై కిల్లర్ బౌన్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో త్యాగి వేసిన కిల్లర్ బౌన్సర్‌కి ఆసీస్ ఆటగాడు విల్ పుకోవిస్కి గ్రౌండ్‌లో ఒక్కసారిగా కుప్పకూలాడు. తీవ్ర గాయం కావడంతో 23 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
కంగారూలకు దెబ్బ మీద దెబ్బ
ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పుకో విస్కీ భారత్ బౌలర్ కార్తీక్ త్యాగి వేసిన బౌన్సర్ కారణంగా గాయమై స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. ఇంతకు ముందు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా అర్ధంతరంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. అతను టెస్ట్ సిరీస్‌కూ అందుబాటులో ఉండటం లేదు. తాజాగా మరో బ్యాట్స్‌మెన్ కూడా గాయపడటంతో ఇప్పుడు ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్టైంది. అయితే పుకో విస్కీ గాయం అంత తీవ్రమైనది కాదని.. మొదటి టెస్ట్‌కు అతను అందుబాటులో ఉంటాడని టీం మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. డిసెంబర్ 17 నుంచి మొదటి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్ బౌలర్లు
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ప్రాక్టీస్ (డే/నైట్) మ్యాచ్‌లో భారత్ బౌలర్లు రాణించారు. భారత్ పేస్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా ఏ-జట్టు 108 పరుగులకే పెవిలియన్ బాట పట్టింది. కీపర్ అలెక్స్ క్యారీ ఒక్కడే 32 పరుగులతో అత్యధికంగా రాణించాడు. భారత బౌలర్లలో షమీ, నవదీప్, సైనీ చెరో మూడు వికెట్లు తీయగా బూమ్రా రెండు వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 194 పరుగులకు ఆలౌట్ అయింది.
Fingers crossed for Will Pucovksi, who's retired hurt after this nasty blow to the helmet.
— cricket.com.au (@cricketcomau) December 8, 2020
Live scores from #AUSAvIND: https://t.co/MfBZAvzAkr pic.twitter.com/pzEBTfipF2