తొలి టెస్టు ఓడిన ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..!

అడిలైడ్‌లో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తలిగింది.

By Medi Samrat  Published on  30 Nov 2024 11:22 AM IST
తొలి టెస్టు ఓడిన ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..!

అడిలైడ్‌లో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తలిగింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ లో-గ్రేడ్ లెఫ్ట్ సైడ్ ఇంజురీ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. పింక్-బాల్, డే-నైట్ మ్యాచ్ డిసెంబర్ 6న ప్రారంభం కానుంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 0-1తో వెనుకబడి ఉంది.

ప్లేయింగ్ XIలో హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ తీసుకునే అవకాశం ఉంది. 2023లో లీడ్స్‌లో జరిగిన యాషెస్ టెస్టులో చివరిసారిగా ఆడిన బోలాండ్, అడిలైడ్ టెస్టుకు ముందు జరిగే ప్రైమ్‌మినిస్టర్స్ XI వార్మప్ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

హాజిల్‌వుడ్ గైర్హాజరు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ. పింక్ బాల్‌తో హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ వేయగలడు. డిసెంబర్ 2021లో అడిలైడ్‌లో జరిగిన డే-నైట్ టెస్టులో భారత్‌పై చిరస్మరణీయమైన స్పెల్‌ వేశాడు. ఐదు ఓవర్లలో 5 వికెట్లు సాధించాడు, దీనితో భారతజట్టు ఆ రోజు 36కి కుప్పకూలింది. ఇక ఈ ఏడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో పెర్త్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 29 పరుగులకు 4 వికెట్లు తీశాడు.

Next Story