శతక్కొట్టిన‌ బెయిర్ స్టో..

Jonny Bairstow brings up his 11th hundred. తొలి వన్డేలో సెంచరీకి చేరువ‌లో అవుటైన‌ బెయిర్ స్టో.. రెండో వన్డేలో సెంచ‌రీ

By Medi Samrat  Published on  26 March 2021 3:04 PM GMT
శతక్కొట్టిన‌ బెయిర్ స్టో..

తొలి వన్డేలో సెంచరీకి చేరువ‌లో అవుటైన‌ బెయిర్ స్టో.. రెండో వన్డేలో సెంచ‌రీ బాదేశాడు. చైనా‌మెన్‌ కుల్దీప్ యాద‌వ్‌ వేసిన 30వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మ‌లిచి బెయిర్ స్టో సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. బెయిర్ స్టో సెంచ‌రీలో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇక సెంచ‌రీకి 95 బంతులు తీసుకున్నాడు. కాగా, బెయిర్ స్టో కెరీర్‌లో ఇది 11వ శ‌త‌కం. ఇదిలావుంటే.. ఆల్ రౌండ‌ర్‌ బెన్ స్టోక్స్ (38 బంతుల్లో 49 బ్యాటింగ్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా అర్ధశతకానికి చేరువయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 101 పరుగులు జోడించాడు.

శతక్కొట్టిన‌ బెయిర్ స్టో..అంత‌కుయుందు టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్లు స‌త్తా చాటారు. కేఎల్ రాహుల్ శ‌త‌కం(108; 114 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్స‌ర్లు)తో స‌త్తాచాట‌గా రిష‌బ్ పంత్ (77; 40 బంతుల్లో 3 పోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 336 ప‌రుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ( 66; 79 బంతుల్లో 3 పోర్లు, 1 సిక్స్‌) అర్థ‌శ‌త‌కంతో రాణించగా.. చివ‌ర్లో హార్థిక్ పాండ్య‌(35; 16 బంతుల్లో 1పోర్, 3 సిక్స‌ర్లు) ధాటిగా బ్యాటింగ్ చేయ‌డంతో ఇంగ్లాండ్ ముందు 337 ప‌రుగుల భారీ విజ‌య‌ల‌క్ష్యాన్ని ఉంచింది భార‌త్‌.

Next Story