John Cena : చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న జాన్ సెనా..!
WWE వెటరన్ సూపర్ స్టార్ జాన్ సెనా తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. అతడు శనివారం రాత్రి జరిగే 'సాటర్డే నైట్ మ్యాన్ ఈవెంట్'లో చివరిసారిగా బరిలోకి దిగనున్నాడు.
By - Medi Samrat |
WWE వెటరన్ సూపర్ స్టార్ జాన్ సెనా తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. అతడు శనివారం రాత్రి జరిగే 'సాటర్డే నైట్ మ్యాన్ ఈవెంట్'లో చివరిసారిగా బరిలోకి దిగనున్నాడు. జాన్ సెనా తన చివరి మ్యాచ్‌లో గుంథర్ లేదా LA నైట్‌తో తలపడతాడు. ఈ ఫైట్ ఆదివారం ఉదయం 6.30 గంటలకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్‌లో ప్రసారం కానుంది. జాన్ సెనా చివరి పోరాటం నేపథ్యంలో WWE ప్రపంచం ఉద్వేగానికి లోనైంది.
వ్యాఖ్యాత, మాజీ రెజ్లర్ వేడ్ బారెట్ మాట్లాడుతూ.. 'సెనా రిటైర్మెంట్ ఖాయమని, అయితే అతను ఏడాది పాటు రిటైర్మెంట్ టూర్ చేస్తారని తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. హాలీవుడ్ కమిట్‌మెంట్‌లు ఉన్నప్పటికీ, సెనా 12 నెలల నిరంతర ఇన్-రింగ్ యాక్షన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో పోరాడడం WWE పట్ల అతనికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అన్నారు. సెనా ఈ సంవత్సరం వివిధ రకాల రెజ్లర్లకు వ్యతిరేకంగా పోరాడి చాలా గొప్ప మ్యాచ్‌లను అందించాడని.. అతని అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించాడని బారెట్ చెప్పాడు. చివరి షోడౌన్ LL నైట్ లేదా గుంథర్‌కు వ్యతిరేకంగా జరిగినా, WWE చరిత్రలో ఇది అత్యంత భావోద్వేగ క్షణాలలో ఒకటిగా ఉంటుందన్నారు. సెనా సాధారణంగా తన భావోద్వేగాలను ప్రదర్శించడు, అయితే ఇది తన ప్రశాంతతను కాపాడుకోవడం కష్టంగా భావించే రాత్రి అవుతుందన్నారు. సెనాతో కలిసి పనిచేయడం తన స్థాయిని వేగంగా పెంచుకోవడానికి ప్రేరణనిచ్చిందని, ఆ కాలం తన కెరీర్‌లో అతిపెద్ద పాఠంగా నిరూపించబడిందని చెప్పాడు.
సెనా పదవీ విరమణ తర్వాత అతడి వారసత్వాన్ని కోడి రోడ్స్ పోషిస్తాడని బారెట్ అభిప్రాయపడ్డాడు, అతడు హార్డ్ వర్క్, క్రమశిక్షణ, ప్రమోషనల్ వర్క్‌లో సెనాను పోలి ఉంటాడు. అయితే దీర్ఘకాలంలో డబ్ల్యూడబ్ల్యూఈకి కొత్త తరానికి చెందిన స్టార్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రౌన్ బ్రేకర్, కార్మెలో హేస్, ట్రిక్ విలియమ్స్ భవిష్యత్తులో పెద్ద సూపర్ స్టార్‌లుగా మారే అవకాశం ఉందని అన్నారు. జాన్ సెనా ఫైనల్ ఇన్-రింగ్ ఎంట్రీ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదని, WWE ప్రకాశవంతమైన అధ్యాయానికి ముగింపు.. కొత్త శకానికి నాంది అని బారెట్ చెప్పాడు.