ముంబై ఇండియ‌న్స్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. అత‌డు వ‌చ్చేస్తున్నాడు..!

Jofra Archer is likely to play this IPL Season.మ‌రో రెండు వారాల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 సీజ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2022 8:12 PM IST
ముంబై ఇండియ‌న్స్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. అత‌డు వ‌చ్చేస్తున్నాడు..!

మ‌రో రెండు వారాల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 సీజ‌న్ ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు శుభ‌వార్త చెప్పింది. గాయం కార‌ణంగా గ‌త కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ ఈ సీజ‌న్ కోసం సిద్దం అవుతున్నాడు. అత‌డు ప్రాక్టీస్ మొద‌లుపెట్టేశాడు. జోఫ్రా ఆర్చ‌ర్ బ్యాటింగ్‌, బౌలింగ్ చేస్తున్న వీడియోల‌ను ముంబై జ‌ట్టు సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. ఈ సారి జ‌రిగిన మెగా వేలంగా ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఆర్చ‌ర్‌ను రూ.8 కోట్ల‌కు సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ముంబై ట్వీట్ చూసిన అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. తాజా వీడియోను చూస్తే ఈ సీజ‌న్‌లో అత‌డు ముంబై త‌రుపున బ‌రిలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కాగా..గాయం కార‌ణంగా ఇంగ్లాండ్ త‌రుపున కూడా ఆర్చ‌ర్ ప్ర‌స్తుతం ఆడ‌డం లేదు. ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్చ‌ర్.. 35 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు ప‌డ‌గొట్టాడు. బ్యాటింగ్‌లో 195 ప‌రుగులు చేశాడు. గ‌త సీజ‌న్‌లో ఆర్చ‌ర్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (16 కోట్లు), ఇషాన్‌ కిషన్ (15.25 కోట్లు), జ‌స్ప్రీత్‌ బుమ్రా (12 కోట్లు), టిమ్‌ డేవిడ్ (ఓవర్సీస్ - రూ. 8.25 కోట్లు), కీరన్‌ పొలార్డ్ (6 కోట్లు), సూర్యకుమార్ యాద‌వ్ (8 కోట్లు), జొఫ్రా ఆర్చర్ (ఓవర్సీస్ రూ. 8 కోట్లు), డేవిడ్ బ్రెవిస్‌ (ఓవర్సీస్‌-3 కోట్లు), డేనియల్‌ సామ్స్‌ (ఓవర్సీస్ -రూ. 2.60 కోట్లు), తిలక్‌ వర్మ(1.70 కోట్లు), మురుగన్‌ అశ్విన్ (1.60 కోట్లు), టైమల్‌ మిల్స్‌ (ఓవర్సీస్‌-1.50 కోట్లు), జయ్‌దేవ్‌ ఉనద్కత్ (1.30 కోట్లు), రిలే మెరెడిత్ (ఓవర్సీస్ కోటి), ఫాబియన్‌ అలెన్ (ఓవర్సీస్ 75 లక్షలు), మయాంక్‌ మార్కండే ( 65 లక్షలు), సంజయ్‌ యాదవ్ (50 లక్షలు), బసిల్ థంపి (30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (30 లక్షలు), ఆర్యన్ జుయల్‌, హృతిక్‌ షోకీన్‌, మహమ్మద్‌ అర్షద్‌ ఖాన్‌, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, రాహుల్‌ బుద్ది, రమణ్‌ దీప్‌ సింగ్ (వీరికి రూ.20ల‌క్ష‌లు)

Next Story