సంచలన నిర్ణయం తీసుకున్న జో రూట్

Joe Root Steps Down As England Men's Test Captain. ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు జో రూట్‌ శుక్రవారం నాడు ప్రకటించాడు.

By Medi Samrat  Published on  15 April 2022 10:03 AM GMT
సంచలన నిర్ణయం తీసుకున్న జో రూట్

ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు జో రూట్‌ శుక్రవారం నాడు ప్రకటించాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లపై ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ ఓడిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. యాషెస్‌లో, ఇంగ్లండ్ 0-4తో పరాజయం పాలైంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 0-1తో కోల్పోయింది. రూట్ 27 టెస్టులు గెలిచిన తర్వాత అత్యంత విజయవంతమైన ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ గా నిలిచినప్పటికీ ఈ రెండు సిరీస్ ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ గత కెప్టెన్స్ మైఖేల్ వాన్, అలెస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్‌ల కంటే ఎక్కువ విజయాలను జో రూట్ కెప్టెన్సీలో సాధించింది ఇంగ్లండ్.

"కరేబియన్ టూర్ నుండి తిరిగి వచ్చిన ఆలోచించానని.. అందుకు సమయం కూడా తీసుకుని.. ఇంగ్లండ్ పురుషుల టెస్ట్ కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఇది నా కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన నిర్ణయం, కానీ నా కుటుంబం, సన్నిహితులతో చర్చించి కెప్టెన్సీ నుండి వైదొలగడానికి సరైన సమయమని తెలుసుకున్నాను "అని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో రూట్ పేర్కొన్నాడు.

అలెస్టర్ కుక్ తర్వాత రూట్ 2017లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రూట్ 2018లో భారత్‌పై 4-1 హోమ్ సిరీస్ విజయం, 2020లో దక్షిణాఫ్రికాపై 3-1 విజయంతో సహా కొన్ని ప్రసిద్ధ విజయాలలో ఇంగ్లండ్‌ కు సారథ్యం వహించాడు. 2018లో అతను 2001 నుండి శ్రీలంకలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న మొదటి ఇంగ్లండ్ పురుషుల కెప్టెన్‌గా నిలిచాడు, 2021లో శ్రీలంకలో 2-0 విజయంతో అతను ఈ ఘనతను పునరావృతం చేశాడు. రూట్ ఇప్పటికే ఇంగ్లండ్‌లో అత్యధిక టెస్టు పరుగుల స్కోరర్‌లో ఆల్ టైమ్ కుక్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా 14 సెంచరీలు చేశాడు. కెప్టెన్‌గా ఆల్-టైమ్ లిస్ట్‌లో గ్రేమ్ స్మిత్, అలాన్ బోర్డర్, రికీ పాంటింగ్ మరియు విరాట్ కోహ్లీ తర్వాత 5వ స్థానంలో నిలిచాడు.
Next Story
Share it