మ్యాచ్‌ను గెలిపించే నైపుణ్యం నాలో ఉందని నా గురువు చెప్పాడు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జరిగిన 70వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ని ఓడించింది.
By Medi Samrat
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జరిగిన 70వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ని ఓడించింది. ఈ మ్యాచ్ 27 మే 2025న లక్నక్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టులో కెప్టెన్ రిషబ్ పంత్ అజేయ ఇన్నింగ్స్ 118 పరుగులు, మిచెల్ మార్ష్ 67 పరుగులతో ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోరు సాధించింది.
జవాబుగా దిగిన ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ 54 పరుగులు చేశాడు. ఆ తర్వాత జితేష్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 85 పరుగులు చేశాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (41 నాటౌట్) నుంచి కూడా మంచి మద్దతు లభించింది. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 107 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. దీంతో ఆర్‌సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో విజయం తర్వాత RCB తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ మాట్లాడుతూ.. తాను ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడని నమ్మలేకపోతున్నానని చెప్పాడు. అలాగే విరాట్ భాయ్ ఔటైన తర్వాత మ్యాచ్‌ని చివరి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, అందులో విజయం సాధించానని చెప్పాడు. ప్రస్తుతం నా భావాలను మాటల్లో వివరించలేను. ఈ రోజు నాపై చాలా ఒత్తిడి ఉంది కానీ నేను దానిని ఆనందిస్తున్నాను. విరాట్ భాయ్, కృనాల్ (పాండ్యా) భాయ్, భువనేశ్వర్ భాయ్‌లను చూసినప్పుడు నాకు చాలా నమ్మకం కలుగుతుంది. "ప్రస్తుతానికి ఈ విజయాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను. అదే సమయంలో అలసట నుంచి కూడా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మ్యాచ్‌ని చివరి వరకు తీసుకెళ్తే జట్టును విజయపథంలో నడిపించే నైపుణ్యం నాలో ఉందని నా గురువు దినేష్ కార్తీక్ చెప్పాడని పేర్కొన్నాడు.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో జితేష్ శర్మ 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 85 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 45 బంతుల్లో 107 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి RCBని విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో RCB IPL 2025 ప్లేఆఫ్స్‌లో టాప్-2లోకి చేరుకుంది.