సీనియర్‌ పేసర్‌ రీఎంట్రీ.. లార్డ్స్‌లో ఫేర్‌వెల్‌ మ్యాచ్‌..!

Jhulan Goswami returns for India's ODI series in England.ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించే భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టును

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2022 2:47 PM IST
సీనియర్‌ పేసర్‌ రీఎంట్రీ.. లార్డ్స్‌లో ఫేర్‌వెల్‌ మ్యాచ్‌..!

ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించే భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టును సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించారు. అయితే.. అనూహ్యంగా సీనియ‌ర్ ప్లేయ‌ర్ ఝులన్‌ గోస్వామికి జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఇటీవ‌ల శ్రీలంకతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌కు ఝుల‌న్‌ను ప‌క్క‌న బెట్ట‌గా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయ‌డంతో ఆమె రిటైర్‌మెంట్‌పై దాదాపు క్లారిటీ ఇచ్చిన‌ట్లైంది. సెప్టెంబ‌ర్ 24న జ‌రిగే మూడో వ‌న్డేతో ఝుల‌న్ అంత‌ర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప‌ల‌క‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

2018లో ఝుల‌న్ టి20 క్రికెట్ నుంచి త‌ప్పుకున్న‌సంగ‌తి తెలిసిందే. కేవ‌లం వ‌న్డేల‌కు ప‌రిమిత‌మైంది. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో 200, 250 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి బౌల‌ర్‌గా ఝులన్‌ గోస్వామి చ‌రిత్ర సృష్టించింది. టీమ్ఇండియా త‌రుపున 199 వ‌న్డే మ్యాచుల్లో 250 వికెట్లు, 68 టీ20ల్లో 56 వికెట్లు, 12 టెస్టుల్లో 44 వికెట్లు తీసింది 39 ఏళ్ల ఝుల‌న్‌.

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా మూడు టి20లు, మూడు వ‌న్డేలు ఆడ‌నుంది.

ఇంగ్లాండ్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్లు ఇవే..

భారత T20I జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, జెమీమా రోడ్రిగ్స్, స్నేహ రాణా, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, రాధా యాదవ్, సబ్బినేని మేఘనా, తాన్తియా ), రాజేశ్వరి గయాక్వాడ్, దయాళన్ హేమలత, సిమ్రాన్ దిల్ బహదూర్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), కె.పి నవ్‌గిరే

భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, తనియా సప్నా భాటియా (వికెట్ కీప‌ర్‌), యాస్తికా భాటియా (వికెట్ కీప‌ర్‌), పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రేణుకా ఠాకూర్ సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్, హర్లీన్ డియోల్, దయాళన్ హేమలత, సిమ్రాన్ దిల్ బహదూర్, ఝులన్ గోస్వామి, జెమిమా రోడ్రిగ్స్

Next Story