భారత్ కు మరో బంగారం
Jeremy Lalrinnunga wins Gold Medal. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో
By Medi SamratPublished on : 31 July 2022 5:45 PM IST
Next Story
బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో పసిడి పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ లో 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్ రినుంగ స్వర్ణం సాధించాడు. క్లీన్ అండ్ జెర్క్ లో 160 కేజీలతో కలిపి మొత్తం 300 కేజీల బరువునెత్తి కామన్వెల్త్ రికార్డ్ సహా పసిడి మోత మోగించాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 67 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని గెలిచి 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా తన కలను సాకారం చేసుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ రికార్డును 300 కిలోలు (140 కిలోల స్నాచ్ మరియు క్లీన్ అండ్ జెర్క్‌లో 160 కిలోలు) అందుకున్నాడు.
శనివారం జరిగిన మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను గోల్డ్ గెలవడం తర్వాత.. CWG 2022లో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. ఈ పతకంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల సంఖ్య ఐదుకి పెరిగింది. ఈ ఐదు పతకాలు వెయిట్ లిఫ్టింగ్ లోనే లభించడం విశేషం. ఇప్పటిదాకా భారత్ 2 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. తద్వారా పతకాల పట్టికలో ఆరోస్థానానికి చేరింది.