కొత్త కోచ్‌తోనే ఆ పర్యటనకు వెళ్తాం : జై షా
టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. టైటిల్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు తమ కోచ్‌కు చిరస్మరణీయ వీడ్కోలు పలికారు
By Medi Samrat Published on 1 July 2024 9:21 AM GMTటీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. టైటిల్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు తమ కోచ్‌కు చిరస్మరణీయ వీడ్కోలు పలికారు. టీమ్‌ఇండియా కోచ్ ఎవరనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కొత్త చీఫ్ నియామకానికి సంబంధించి బీసీసీఐ సెక్రటరీ జే షా ఓ పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. శ్రీలంక సిరీస్‌లో టీమిండియా కొత్త కోచ్‌తో ఆడుతుందని చెప్పాడు.
భారత జట్టు కొత్త కోచ్‌ని జూలై నెలాఖరులోగా ఖరారు చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఇటీవలే క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) భారత కొత్త కోచ్ కోసం ఇద్దరు అనుభవజ్ఞులను ఇంటర్వ్యూ చేసిందని.. వారిలో ఒకరిని ఎంపిక చేసి త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు.
"కోచ్, సెలెక్టర్లు ఇద్దరినీ త్వరలో నియమిస్తాం. CAC ఇంటర్వ్యూలు నిర్వహించి ఇద్దరి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ముంబైకి చేరుకున్న తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకున్నా.. మేము VVS లక్ష్మణ్‌తో జింబాబ్వేకు బయలుదేరుతాం, కానీ శ్రీలంక సిరీస్‌కు కొత్త కోచ్ చేరతారు అని పేర్కొన్నారు.
కొత్త కోచ్ పదవీకాలం జూలై 2024 నుండి డిసెంబర్ 31, 2027 వరకు ఉంటుంది. జూన్ 18న బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ జాతీయ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం గౌతమ్ గంభీర్, WV రామన్‌లను ఇంటర్వ్యూ చేసింది. వీరిద్దరూ అశోక్ మల్హోత్రాతో సహా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. జులై 27 నుంచి ఆగస్ట్ 7 మధ్య మూడు టీ20ల సిరీస్, వన్డే మ్యాచ్‌ల కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.
టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో హిట్ మ్యాన్ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే టెస్టులు, వన్డేల్లో టీమ్‌ఇండియాకు సారథ్యం వహించనున్నాడు. దీంతో టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యా రానున్నాడు.