జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌పై చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో బుమ్రా పేరిట ఒక ఇబ్బందికరమైన రికార్డు నమోదైంది. ఇది అతని 7 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌పై మరక తెచ్చింది.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 358 పరుగులకు కుప్పకూలింది. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసి 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జో రూట్, బెన్ స్టోక్స్ సెంచరీలు చేశారు. జడేజాకు నాలుగు వికెట్లు లభించగా, సుందర్, బుమ్రాలకు చెరో రెండు వికెట్లు లభించాయి.
ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా పేరిట ఓ అవమానకరమైన రికార్డు నమోదైంది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లో 100కి పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. అంతకుముందు.. అతడు 2024/25లో MCGలో ఆస్ట్రేలియాపై 28.4 ఓవర్లలు వేసి 99 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
బుమ్రా తన టెస్టు కెరీర్‌లో తొలిసారి 100కు పైగా పరుగులు ఇచ్చాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 5 మెయిడెన్ ఓవర్లు వేసి మొత్తం 112 పరుగులు ఇచ్చాడు. ఇది కాకుండా బుమ్రా తన టెస్టు కెరీర్‌లో రెండోసారి ఇన్నింగ్స్‌లో 30 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంతకుముందు అతడు 2021లో చెన్నైలో ఇంగ్లండ్‌పై 36 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇప్పుడు మాంచెస్టర్‌లో బుమ్రా 33 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.