మరోసారి జస్ప్రీత్‌ బుమ్రా జట్టుకు దూరం

Jasprit Bumrah Ruled Out of ODI Series Against Sri Lanka. శ్రీలంకతో మెదలయ్యే 3 వన్డేల సిరీస్ కు పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు.

By Medi Samrat  Published on  9 Jan 2023 10:52 AM GMT
మరోసారి జస్ప్రీత్‌ బుమ్రా జట్టుకు దూరం

శ్రీలంకతో మెదలయ్యే 3 వన్డేల సిరీస్ కు పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్‌ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. శ్రీలంకతో జరిగే 3 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ముందుగా బీసీసీఐ బుమ్రాను ఎంపిక చేసింది. అయితే చివరి నిమిషంలో అతన్ని తప్పించింది. బుమ్రా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడాడు. ఆ తర్వాత ప్రపంచ కప్ కు కూడా బుమ్రా దూరమయ్యాడు. ఇక తిరిగి ఫిట్నెస్ ను బుమ్రా సాధించాడని ఆనందపడే లోపే.. బుమ్రా వన్డే సిరీస్ కు దూరమంటూ కథనాలు వచ్చాయి. ఇక బుమ్రా రీప్లేస్మెంట్ ను ప్రకటించాల్సి ఉంది.

శ్రీలంక మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), వాషింగ్టన్‌ సుందర్‌,చాహల్, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్, షమి, సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.


Next Story
Share it