చ‌రిత్ర సృష్టించిన బుమ్రా.. ఆ రికార్డు సాధించిన‌ మొద‌టి భారత ఫాస్ట్ బౌలర్ అత‌డే..!

ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నంబర్-1 బౌలర్‌గా నిలిచాడు.

By Medi Samrat  Published on  7 Feb 2024 2:36 PM IST
చ‌రిత్ర సృష్టించిన బుమ్రా.. ఆ రికార్డు సాధించిన‌ మొద‌టి భారత ఫాస్ట్ బౌలర్ అత‌డే..!

ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నంబర్-1 బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఆ రికార్డు సాధించి బుమ్రా చ‌రిత్ర సృష్టించాడు. విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్‌పై జస్ప్రీత్ బుమ్రా మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు.

బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ ప్రదర్శన ఆధారంగా బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే బుమ్రా కార‌ణంగా రవిచంద్రన్ అశ్విన్ భారీ నష్టాన్ని చవిచూశాడు.

గతేడాది మార్చి నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అతను కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. దీని కారణంగా అతను రెండు స్థానాలను కోల్పోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Next Story