ఈ ఏడాది ఐపీఎల్ కు స్టార్ ఆటగాడు జేసన్ రాయ్ దూరమవుతున్నట్లు ప్రకటించాడు. గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది మెగా వేలంపాటలో రాయ్ ను కొనుక్కుంది. ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్ టోర్నమెంట్ లో భాగంగా బయో బబుల్ లో ఎక్కువ కాలం ఉండలేననే కారణం చెబుతూ IPL 2022 నుండి వైదొలిగాడు. వేలంలో తన బేస్ ధర INR 2 కోట్ల (USD 266,000)కి గుజరాత్ టైటాన్స్ రాయ్ ను సొంతం చేసుకోగా.. గత వారం తన నిర్ణయాన్ని ఫ్రాంచైజీకి తెలియజేసినట్లు తెలుస్తోంది. టైటాన్స్ అతడి స్థానంలో ప్రత్యామ్నాయం గురించి ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు.
31 ఏళ్ల రాయ్ ఇటీవలే PSL 2022లో మంచి ఆటతీరును ప్రదర్శించాడు. బయోసెక్యూర్ బబుల్‌లో టోర్నమెంట్ లో అతను కేవలం ఆరు మ్యాచ్‌లు ఆడినప్పటికీ స్టార్ ఆటగాడిగా నిలిచాడు. రాయ్ 50.50 సగటుతో మరియు 170.22 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు సాధించాడు, రెండు అర్ధశతకాలు, ఒక శతకం సాధించాడు. గణాంకాల ఆధారంగా టోర్నమెంట్ MVPల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. వేలం తర్వాత ఐపీఎల్ ఆడకూడదని రాయ్ నిర్ణయించుకోవడం ఇది రెండోసారి. 2020లో, ఢిల్లీ క్యాపిటల్స్ రాయ్‌ని అతని అప్పటి బేస్ ధర అయిన INR 1.5 కోట్లకు తీసుకుంది, అయితే అతను వ్యక్తిగత కారణాలతో వైదొలిగాడు.