రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ సంచలనం

రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూకశ్మీర్ జట్టు సంచలనం సృష్టించింది.

By -  Knakam Karthik
Published on : 18 Feb 2026 6:47 PM IST

Sports News, Cricket, Ranji Trophy, Jammu and Kashmir

రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ సంచలనం

రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూకశ్మీర్ జట్టు సంచలనం సృష్టించింది. బెంగాల్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. జమ్మూకశ్మీర్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడో రోజు ఆటలో బెంగాల్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 99 పరుగులకే కుప్పకూల్చింది. సీమ్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో జమ్మూకశ్మీర్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.

బెంగాల్ పేసర్లు మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్ విజృంభించడంతో జమ్మూ కశ్మీర్ ఓపెనర్లు శుభమ్ పుండిర్ (27), కెప్టెన్ పరాస్ డోగ్రా (9) త్వరగానే వెనుదిరిగారు. అబ్దుల్ సమద్, వంశజ్ బాగా ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన ఆకిబ్ నబీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగే ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టు కర్ణాటకతో తలపడనుంది.

Next Story