న్యూయార్క్ లో ఆడడం చాలా కష్టం.. తేల్చేసిన రోహిత్ శర్మ

నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియా అమెరికాని 7 వికెట్ల తేడాతో ఓడించి T20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 స్టేజ్‌కి అర్హత సాధించింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jun 2024 2:30 PM IST
New York pitch, Rohit Sharma, T20 World Cup

న్యూయార్క్ లో ఆడడం చాలా కష్టం.. తేల్చేసిన రోహిత్ శర్మ 

నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియా అమెరికాని 7 వికెట్ల తేడాతో ఓడించి T20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 స్టేజ్‌కి అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత టోర్నమెంట్ తదుపరి దశకు అర్హత సాధించిన మూడవ జట్టుగా భారత్ నిలిచింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు నసావు కౌంటీ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు ఆడింది. ఈ మూడు మ్యాచ్ లను గెలిచింది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి, ఆపై లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి, గ్రూప్ దశలోని మూడో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అమెరికాను ఓడించింది.

ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ న్యూ యార్క్‌లో క్రికెట్ ఆడటం అంత సులభం కాదని తేల్చి చెప్పాడు. మూడు గేమ్‌లలోనూ చివరి వరకు మ్యాచ్ సాగిందని అన్నాడు. ఈ విజయాలు తమ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్‌ పై ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారని.. పరుగులను కట్టడి చేయడంలో సమిష్టిగా రాణించారని తెలిపాడు. ఛేజింగ్ లో శివమ్ దూబే-సూర్య కుమార్ యాదవ్ రాణించడం జట్టుకు శుభ సూచకమన్నాడు. సూర్య కుమార్ ఆట అద్భుతంగా ఉందని.. భిన్నమైన ఆటతో అద్భుతంగా రాణించాడన్నాడు రోహిత్.

Next Story