షాకింగ్ : ఆటకు గుడ్‌బై చెప్పిన‌ స్టార్‌ క్రికెటర్‌

Isuru Udana retires from international cricket. శ్రీలంక క్రికెటర్‌ ఇసురు ఉదాన ఇంట‌ర్నేష‌న‌ల్‌ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

By Medi Samrat
Published on : 31 July 2021 5:55 PM IST

షాకింగ్ : ఆటకు గుడ్‌బై చెప్పిన‌ స్టార్‌ క్రికెటర్‌

శ్రీలంక క్రికెటర్‌ ఇసురు ఉదాన ఇంట‌ర్నేష‌న‌ల్‌ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇటీవ‌ల‌ భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గింది శ్రీలంక‌. ఆ జ‌ట్టులో ఉదాన స‌భ్యుడు. అయితే.. జ‌ట్టు గెలిచిన ఆనందంలో ఉండ‌గా.. ఉదాన అనూహ్య నిర్ణ‌యం బోర్డుకు షాకింగ్ న్యూసే. ఇక భార‌త్‌లో సిరీస్‌లో ఉదాన పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు మ్యాచ్‌లాడిన ఉదాన ఒక్క‌ వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌క‌పోగా.. దారాళంగా ప‌రుగులిచ్చాడు. వన్డే సిరీస్‌లోనూ ఆక‌ట్టుకోలేక‌పోయాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌ ద్వారా 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఉదాన.. 21 వన్డేల్లో 237 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 18 వికెట్లు తీశాడు. 34 టీ20ల్లో 256 పరుగులు చేయ‌డంతో పాటు 27 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో ఉదాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడాడు.


Next Story