మను భాకర్ కాదు ప‌త‌కం సాధించింది.. సోనమ్ మస్కర్.!

మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ISSF వరల్డ్ కప్ ఫైనల్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ సోనమ్ మస్కర్ రజత పతకాన్ని గెలుచుకుంది

By Medi Samrat  Published on  15 Oct 2024 3:37 PM IST
మను భాకర్ కాదు ప‌త‌కం సాధించింది.. సోనమ్ మస్కర్.!

మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ISSF వరల్డ్ కప్ ఫైనల్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ సోనమ్ మస్కర్ రజత పతకాన్ని గెలుచుకుంది. చైనాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ హువాంగ్ యుటింగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పోటీలో సోనమ్ మొత్తం స్కోరు 252.9 కాగా.. చైనా షూటర్ హువాంగ్ 254.3 స్కోరుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత్‌కు చెందిన మరో మహిళా షూటర్‌ 16 ఏళ్ల టిల్‌తోమా సేన్‌ ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సేన్ మొత్తం స్కోరు 167.7. ఈ పోటీలో ఫ్రాన్స్‌కు చెందిన ఓసీన్ ముల్లర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన షూటర్లు టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించారు. అయితే భారత్‌కు చెందిన మను భాకర్, సరబ్జోత్ సింగ్, స్వినిల్ కుసాలే ISFF ప్రపంచ కప్ 2024లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 9 మంది అథ్లెట్లు ISSF ప్రపంచ కప్ ఫైనల్ 2024 కోసం భారత జట్టులో చోటు సంపాదించారు. ఈ ఈవెంట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ షూటర్లు పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో ఒక్కో రోజు నాలుగు ఫైనల్స్ జరుగుతాయి.

Next Story