అనుకున్నట్లుగానే.. ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ..!

ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat
Published on : 18 March 2026 6:11 PM IST

అనుకున్నట్లుగానే.. ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ..!

ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయంతో బాధపడుతుండటంతో, అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. ఓపెనర్ అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు.

వెన్నునొప్పి కారణంగా ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అతను పూర్తిగా కోలుకున్న తర్వాతే జట్టులో చేరుతారని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే తొలి పోరులో సన్‌రైజర్స్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Next Story