ఫైనల్లో సిక్స‌ర్ల మోత‌.. ఇషాన్ కిషన్ సూప‌ర్‌ సెంచరీ..!

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ చేశాడు. హర్యానా ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.

By -  Medi Samrat
Published on : 18 Dec 2025 6:33 PM IST

ఫైనల్లో సిక్స‌ర్ల మోత‌.. ఇషాన్ కిషన్ సూప‌ర్‌ సెంచరీ..!

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ చేశాడు. హర్యానా ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇషాన్ ఓపెనింగ్ వచ్చి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. స్కోరు 3 వద్ద విరాట్ సింగ్ వికెట్ కోల్పోయిన తర్వాత ఇషాన్ కుమార్ కుషాగ్రాతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్ర‌మంలోనే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఇషాన్ నిలిచాడు. ఇషాన్ 10 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో 516 పరుగులు చేశాడు. టోర్నీ ఆరంభం నుంచి ఇషాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జ‌రిగిన పైన‌ల్లో ఇషాన్ కిషన్ కుమార్ కుషాగ్రాతో కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ హర్యానా బౌలర్లను దారుణంగా ఆడుకున్నారు. ఇషాన్ 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్ 222.22 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఇషాన్ 10 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. ఈ క్ర‌మంలోనే కుమార్ కుషాగ్రాతో కలిసి రెండో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్ ఇషాన్. సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. 49 బంతుల్లో 101 పరుగులు చేసి ఇషాన్ ఔటయ్యాడు. ఇషాన్ ఇన్నింగ్సుతో జార్ఖండ్ 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 262 ప‌రుగులు చేసింది.

అతని కెప్టెన్సీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టును సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. సూపర్ లీగ్ గ్రూప్ Aలో ఆంధ్రప్రదేశ్‌పై ఓటమి పాలైనప్పటికీ, జార్ఖండ్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది, ఎందుకంటే పాయింట్ల పట్టికలో రన్ రేట్ పరంగా ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. సూపర్ లీగ్ గ్రూప్ A చివరి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర ఏడు వికెట్లకు 203 పరుగులు చేసి జార్ఖండ్‌ను ఎనిమిది వికెట్లకు 194 పరుగులకే పరిమితం చేసింది. జార్ఖండ్ ప్లస్ 0.221 నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రా మైనస్ 0.113 నెట్ రన్‌రేట్‌ను కలిగి ఉంది. ఆంధ్రా తరఫున నితీష్ కుమార్ రెడ్డి 22 బంతుల్లో 45 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.

Next Story