భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో నిరవధికంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మే 16వ తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఫైనల్ మ్యాచ్ మే 30 లేదా జూన్ 1న జరిగే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు వేర్వేరు వేదికల్లో జరుగుతాయని - చాలావరకు నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ టోర్నమెంట్ లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. కాగా హైదరాబాద్‌లో క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 30 లేదా జూన్ 1న కోల్‌కతాలో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. వాతావరణంపై ఆధారపడి, క్వాలిఫయర్ 2,ఫైనల్ కోల్‌కతాలో జరిగే అవకాశం ఉందని సమాచారం. వర్షం మ్యాచ్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లయితే, ఫైనల్‌ను అహ్మదాబాద్‌కు మారుస్తారు. కాగా బీసీసీఐ త్వరలోనే అధికారిక షెడ్యూల్‌ను రిలీజ్ చేయనుంది.
మరో వైపు జమ్ముకశ్మీర్, పఠాన్‌కోట్ సమీప ప్రాంతాల్లో వైమానిక దాడుల హెచ్చరికల నేపథ్యంలో ధర్మశాలలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను నో కాంటెస్ట్‌గా పరిగణించి రెండు జట్లకు ఒక పాయింట్ చొప్పున ఇవ్వనున్నారు.