ఐపీఎల్ కు కొత్తగా రెండు జట్లు వచ్చేస్తున్నాయి.. ఆ నగరాల నుండే..

IPL New Franchises. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వచ్చే ఏడాది నుండి రెండు కొత్త జట్లు సందడి చేయనున్నాయి.

By Medi Samrat  Published on  25 Oct 2021 2:43 PM GMT
ఐపీఎల్ కు కొత్తగా రెండు జట్లు వచ్చేస్తున్నాయి.. ఆ నగరాల నుండే..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వచ్చే ఏడాది నుండి రెండు కొత్త జట్లు సందడి చేయనున్నాయి. మొత్తం ఆరు పట్టణాలతో ఐపీఎల్‌ యాజమాన్యం జాబితాను విడుదల చేసింది. వీటిలో రెండు సిటీల నుంచి కొత్త జట్లు ఉంటాయని ఇప్పటికే ప్రకటించింది. నేడు ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం పది కంపెనీలు టెండర్లు వేశాయి. టెండర్లను పరిశీలించిన తర్వాత వీటి ఫలితాలను ఐపీఎల్‌ యాజమాన్యం వెల్లడించింది. ఇంతకూ ఆ నగరాలు ఏవంటే.. అహ్మదాబాద్‌, లక్నో జట్లు,,! ఇప్పుడు ఉన్న ఎనిమిది జట్లతో పాటూ.. ఈ కొత్త జట్లు కూడా వచ్చే ఐపీఎల్‌ లో తలపడనున్నాయి.

అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్, లక్నో జట్టును ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ దక్కించుకున్నాయి. సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని RPSG గ్రూప్ లక్నో టీంను గెలుచుకుంది. దీనికోసం రూ. 7000 కోట్లకు బిడ్‌ను వేసి గెలుచుకుంది. అలాగే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CVC క్యాపిటల్ అహ్మదాబాద్ టీంను గెలుచుకుంది. అహ్మదాబాద్‌ టీమ్‌‌ను రూ.5,200 కోట్లకు CVC క్యాపిటల్ సంస్థ దక్కించుకుంది. దీంతో బీసీసీఐకి రూ.12,690 కోట్ల ఆదాయం రానుంది. అదానీ గ్రూప్ కూడా బిడ్‌ దాఖలు చేసింది. కానీ, గెలవలేకపోయింది.

ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ 7090 కోట్ల రూపాయల భారీ బిడ్‌తో లక్నోను తమ హోమ్ బేస్‌గా ఎంచుకుంది, సీవీసీ క్యాపిటల్స్ 5000 కోట్ల కంటే ఎక్కువ రెండవ అత్యధిక బిడ్‌తో అహ్మదాబాద్‌ను ఎంచుకుంది. "మా బిడ్డింగ్‌ విషయంలో చాలా ప్రణాళిక ఉంది. బిడ్ గెలిచినందుకు నేను వ్యక్తిగత సిబ్బందికి క్రెడిట్ ఇస్తున్నాను" అని గతంలో రైజింగ్ పూణే సూపర్‌జైంట్ యాజమాన్యంలో ఓనర్ సంజీవ్ గోయెంకా తెలిపారు.


Next Story