ఐపీఎల్ లోకి కొత్త జట్లు.. ఆ నగరాల నుండే..!

IPL New Franchises. ఐపీఎల్ లోకి కొత్త జట్లు రెండు రాబోతున్నాయి. ఆ జట్లు ఏ నగరాలకు సంబంధించినవా అనే

By Medi Samrat  Published on  22 Oct 2021 12:12 PM IST
ఐపీఎల్ లోకి కొత్త జట్లు.. ఆ నగరాల నుండే..!

ఐపీఎల్ లోకి కొత్త జట్లు రెండు రాబోతున్నాయి. ఆ జట్లు ఏ నగరాలకు సంబంధించినవా అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆ నగరాలు అహ్మ‌దాబాద్‌, ల‌క్నో అని అంటున్నారు. ఐపీఎల్ లోకి కొత్తగా రాబోయే న‌గ‌రాలలో ఈ రెండు జట్లు ముందంజ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అహ్మ‌దాబాద్ నుంచి అదానీ గ్రూపు బిడ్డింగ్ వేయ‌నుందని అంటున్నారు. మాంచెస్ట‌ర్ యునైటెడ్ ఓన‌ర్స్‌ గ్లేజ‌ర్ ఫ్యామిలీ కూడా ఐపీఎల్ లోకి రావాలని భావిస్తోందట..! వ‌చ్చే ఏడాది నుంచి ఐపీఎల్ టోర్నీలో ప‌ది జ‌ట్లు పోటీప‌డుతాయి. రెండు కొత్త జ‌ట్ల కోసం బిడ్డింగ్ ఈ నెల 25వ తేదీన జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. అత్య‌ధికంగా బిడ్డింగ్ స‌మ‌ర్పించే ఇద్ద‌రికి ఫ్రాంచైజీ హ‌క్కులు ల‌భిస్తాయి. బిడ్డింగ్ కోసం ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ‌ను అక్టోబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు నిర్వహించారు.

బిడ్డింగ్ ద్వారా సుమారు ప‌దివేల కోట్లు రావచ్చని బీసీసీఐ భావిస్తోంది. బిడ్డింగ్ పేప‌ర్లు దాఖ‌లు చేసిన వారిలో సంజీవ్‌కుమార్‌(ఆర్పీఎస్జీ), గ్లేజ‌ర్ ఫ్యామిలీ(మాంచెస్ట‌ర్ యునైటెడ్‌), అదానీ గ్రూపు, న‌వీన్ జిందాల్‌(జింద‌ల్ ప‌వ‌ర్ అండ్ స్టీల్‌), టొరెంట్ ఫార్మా, రోనీ స్క్రీన్‌వాలా, అర‌బిందో ఫార్మా, కోట‌క్ గ్రూపు, సీవీసీ పార్ట్న‌ర్స్‌, సింగ‌పూర్‌కు చెందిన పీఈ కంపెనీ, హిందుస్తాన్ టైమ్స్ మీడియా, బ్రాడ్‌కాస్ట్ అండ్ స్పోర్ట్ క‌న్స‌ల్టింగ్ ఏజెన్సీస్ గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్‌ను 10 జట్లకు పెంచాలని బీసీసీఐ ఎప్పట్నుంచో భావిస్తోంది. ఐపీఎల్ 2021 నుంచే 10 జట్లను ఆడించాలని బీసీసీఐ చూసినా సమయం లేకపోవడంతో అది కుదరలేదు. ఐపీఎల్ 15వ సీజన్‌లో మొత్తం 74 మ్యాచులు జరగనుండగా.. బీసీసీఐకి 5000 కోట్లు ఆదాయం దక్కనుంది.


Next Story