ఆ రూల్ తో మరింత కిక్ ఇవ్వనున్న ఐపీఎల్

IPL introduces new ‘impact player’ rule that can change match on its head. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఓ కొత్త రూల్ రాబోతోంది. ఐపీఎల్ లో 'సబ్ స్టిట్యూట్' ప్లేయర్ రాబోతున్నాడు.

By Medi Samrat  Published on  2 Dec 2022 3:00 PM GMT
ఆ రూల్ తో మరింత కిక్ ఇవ్వనున్న ఐపీఎల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఓ కొత్త రూల్ రాబోతోంది. ఐపీఎల్ లో 'సబ్ స్టిట్యూట్' ప్లేయర్ రాబోతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ తో ఈ సరికొత్త మార్పును తీసుకుని వస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ లో 'సబ్ స్టిట్యూట్' తో బౌలింగ్, బ్యాటింగ్ చేయించుకోవచ్చు. ఈ సబ్ స్టిట్యూట్ ను 'ఇంపాక్ట్ ప్లేయర్' అని పిలుస్తారు. టాస్ సమయంలో ఒక్కో జట్టు 'ఇంపాక్ట్ ప్లేయర్' కోటాలో నలుగురి పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. మ్యాచ్ సాగే సమయంలో ఆ నలుగురిలో ఒకరిని 'సబ్ స్టిట్యూట్' గా బరిలో దింపి బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయించుకోవచ్చు. ఏ ఇన్నింగ్స్ లో అయినా 14వ ఓవర్ ముగియడానికి ముందే ఈ 'సబ్ స్టిట్యూట్' ను బరిలో దింపాల్సి ఉంటుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది. ఈ 'ఇంపాక్ట్ ప్లేయర్' విధానాన్ని బీసీసీఐ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఐపీఎల్ లోనూ ఈ కొత్త నిబంధన విజయవంతం అవుతుందని బోర్డు భావిస్తోంది. ఈ కొత్త రూల్ తో ఐపీఎల్ లో ప్రతి జట్టులో 12 మంది ఆడవచ్చు. ఇప్పటికే పలు లీగ్ లలో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను ఆడిస్తూ ఉన్నారు. ఐపీఎల్ లో ఈ విధానంతో ఎంత మంది స్టార్స్ గా మారుతారో చూడాలి.


Next Story