'ఆకలితో ఉంచేవాడు.. తాగి కొట్టేవాడు'.. మాజీ ఐపీఎల్ ఆటగాడిపై భార్య ఫిర్యాదు

మాజీ ఐపీఎల్ ఆటగాడు అమిత్ మిశ్రా భార్య అతనిపై వరకట్న వేధింపులు, దాడి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై అదనపు సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ కోర్టులో ఫిర్యాదు చేసింది.

By -  Medi Samrat
Published on : 10 March 2026 12:48 PM IST

ఆకలితో ఉంచేవాడు.. తాగి కొట్టేవాడు.. మాజీ ఐపీఎల్ ఆటగాడిపై భార్య ఫిర్యాదు

మాజీ ఐపీఎల్ ఆటగాడు అమిత్ మిశ్రా భార్య అతనిపై వరకట్న వేధింపులు, దాడి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై అదనపు సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసు మార్చి 27న విచారణకు రానుంది. ఫీల్డ్‌ఖానా నివాసి అయిన గరిమా తివారీ తన భర్త అమిత్ మిశ్రా, అత్తగారు బినా మిశ్రా, మామ శశికాంత్ మిశ్రా, బావమరిది అమర్, వదిన రీతు, మ‌రో వదిన స్వాతిలపై ఫిర్యాదు చేశారు.

ఆమె అమిత్ మిశ్రాను ఏప్రిల్ 26, 2021న వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. వివాహం జరిగినప్పటి నుండి ఆమె అత్తమామలు ఆమెను హోండా సిటీ కారు, 10 లక్షల రూపాయలు కట్నం డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారు. ఆమె మోడలింగ్ ద్వారా సంపాదించిన డబ్బును అమిత్ లాక్కునేవాడు. మద్యం సేవించిన తర్వాత ప్రతిరోజూ ఆమెను వేధించి, దాడి చేసేవాడని ఆరోపించింది. ఆమెను ఆకలితో అలమటించేలా చేశార‌ని, విడాకులు తీసుకుంటానని బెదిరించిన‌ట్లు వెల్ల‌డించింది. దీనితో ఆమె నిరాశకు గురై మోడలింగ్ ఉద్యోగం కోల్పోయింది. అత్తమామల ప్రోద్బలంతో ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది.

మార్చి 2024లో కట్నం తీర్చలేకపోవడంతో అత్తమామలు త‌న‌ను ఇంటి నుండి వెళ్ళగొట్టారని వెల్ల‌డించింది. గరిమ న్యాయవాది కరీం సిద్ధిఖీ మాట్లాడుతూ.. గరిమ స్వయంగా ఫీల్డ్‌ఖానా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ను కలిసి పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఆమె కోర్టులో ఫిర్యాదు చేసింది.

Next Story