రోహిత్‌ కోసం లక్నో రూ.50 కోట్లు సిద్ధం చేసిందా? స్పందించిన ఓనర్ సంజీవ్

భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. ముఖ్యంగా ఐపీఎల్‌ను క్రికెట్‌ అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

By Srikanth Gundamalla  Published on  29 Aug 2024 12:30 PM IST
ipl, cricket, lucknow, sanjiv,  rohit sharma,

రోహిత్‌ కోసం లక్నో రూ.50 కోట్లు సిద్ధం చేసిందా? స్పందించిన ఓనర్ సంజీవ్ 

భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. ముఖ్యంగా ఐపీఎల్‌ను క్రికెట్‌ అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ సీజన్ కొనసాగినన్ని రోజులు క్రికెట్‌ లవర్స్‌కు పండగ వాతావరణం ఉంటుంది. అయితే.. రాబోయే సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ముంబై మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ ఈ సారి వేలంలోకి వస్తారనీ.. ఆయన్ని దక్కించుకునేందుకు కొన్ని టీమ్‌లు ప్రయత్నిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.50 కోట్లు అయినా ఇచ్చి రోహిత్‌ను టీమ్‌లోకి తీసుకోవాలని లక్నో సూపర్ గెయింట్స్‌ జట్టు ప్రయత్నిస్తుందని క్రీడా వర్గాల్లో వార్తలు వచ్చాయి.తాజాగా ఈ న్యూస్‌పై ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయింకా స్పందించారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈసారి ముంబై ఇండియన్స్ జట్టు ఎంతమంది ప్లేయర్లను రిటెయిన్ చేస్తుందో తెలియదు. అయితే.. రోహిత్‌కు 50 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు లక్నో జట్టు ఆసక్తిగా ఉందని తెలిసింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయింకా మాట్లాడుతూ.. రోహిత్ శర్మ అసలు వేలానికి వెళ్లడం ఎప్పుడైనా చూశారా అంటూ ఎదురు ప్రశ్న అడిగారు. ఎలాంటి కారణం లేకుండా కొందరు వదంతులు సృష్టిస్తున్నారని చెప్పారు. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను రిలీజ్ చేస్తుందో లేదో తెలియదు... వేలానికి వస్తారో లేదో కూడా తెలియదు అన్నారు సంజీవ్ గోయింకా. అయితే.. ఒకవేల రోహిత్‌ వేలానికి వస్తే.. 50 శాతం శాలరీ నిబంధనతో కొనుగోలు చేస్తే.. మిగతా ఆటగాళ్లను ఎలా మేనేజ్‌ చేస్తామని అన్నారు. బెస్ట్‌ కెప్టెన్‌ జట్టులో ఉండాలని ఎవరైనా అనుకుంటారు అని చెప్పారు. కానీ.. నీ దగ్గర ఏం ఉన్నది..? ఏది అందుబాటులో ఉందన్న విషయాలను కూడా చూసుకోవాలని వ్యాఖ్యానించారు. అన్ని కావాలన్న ఆలోచన ఉన్నట్లే.. మిగతా ఫ్రాంచైజీలకు ఉంటుందనీ.. కానీ అందరూ చిక్కరని సంజీవ్ గోయింక పేర్కొన్నారు.

Next Story