ఐపీఎల్ ఫైనల్‌లో ఓడినా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అవార్డుల పంట

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ముగిసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మంచి ఫామ్‌ను కనబర్చింది.

By Srikanth Gundamalla  Published on  27 May 2024 7:03 AM GMT
ipl, cricket, awards, sunrisers hyderabad ,

ఐపీఎల్ ఫైనల్‌లో ఓడినా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అవార్డుల పంట 

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ముగిసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మంచి ఫామ్‌ను కనబర్చింది. ఈసారి ఎలాగైనా కప్‌ మనదే అనుకున్నారు ఫ్యాన్స్ అంతా. కానీ.. ఫైనల్‌లో బ్యాటర్లు బోల్తా కొట్టారు. దాంతో.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఘోర ఓటమిని చూసింది. 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముచ్చటగా మూడోసారి కప్‌ను సొంతం చేసుకుంది. పదేళ్ల తర్వాత లీగ్‌లో మళ్లీ విజేతగా నిలిచింది కోల్‌కతా. మరోవైపు ఆరేళ్ల తర్వాత ఫైనల్‌కు వచ్చిన హైదరాబాద్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్‌లో ఓటమిని చూసినా కూడా హైదరాబాద్‌కు ఈ టోర్నీలో అవార్డుల పంట పండింది.

కాగా.. ఐపీఎల్ సీజన్‌లో విజేతగా నలిచిన కోల్‌కతా నైటర్‌ రైడర్స్‌కు రూ. 20 కోట్ల ప్రైజ్‌ మనీ లభించింది. ఇక రన్నరప్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిలవగా రూ.12.50 కోట్లు దక్కాయి. కోల్‌కతా టీమ్‌లో బెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచిన సునీల్ నరైన్‌ రెండు అవార్డులు దక్కాయి. బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింటిలోనూ అతను అద్భుతంగా పెర్ఫార్మెన్స్‌ చేశాడు. దాంతో.. ఫాంటసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌ (రూ.10 లక్షల)తో పాటు.. మోస్ట్ వాల్యుబుల్‌ ప్లేయర్ (రూ.10 లక్షల) అవార్డులను అందుకున్నారు. కాగా.. సునీల్‌ నరైన్‌ మొత్తం 14 మ్యాచుల్లో 488 పరుగులు చేసి.. 17 వికెట్లను తీసుకున్నాడు.

కోహ్లీకు ఆరెంజ్ క్యాప్, హర్షల్‌కు పర్పుల్ క్యాప్

ఈసారి లీగ్‌ దశ నుంచి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ వరకూ వచ్చింది ఆర్‌సీబీ. అయితే.. ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్‌ మరోసారి తన సత్తాను చూపించాడు. టోర్నీ అంతటా బ్యాటింగ్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను (రూ.10లక్షలు) అందుకున్నాడు. కోహ్లీ 15 మ్యాచుల్లో 61 యావరేజ్‌తో 741 పరుగులు చేశాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్ హర్షల్ పటేల్ 14 మ్యాచ్‌లో 24 వికెట్లు తీసి పర్పుల్‌ కలర్‌ క్యాప్‌ను (రూ.10 లక్షలు) అందుకున్నాడు. సీజన్‌ మధ్యలో వచ్చి బెస్ట్‌ స్ట్రైక్‌ రేట్‌తో ఆడాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆగాడు ఫ్రేజర్ మెక్‌గర్క్‌. రెండుసార్లు 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు చేశాడు. 200కి పైగా స్ట్రేక్‌రేట్‌తో ఉ్నాడు. దాంతో..ఈ సీజన్‌లో బెస్ట్‌ స్ట్రైక్‌రేట్‌ (రూ.10 లక్షలు ) అవార్డు గెలుచుకున్నాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు దక్కిన అవార్డులు:

ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌ (రూ.10 లక్షలు) అందుకున్న నితీష్‌ కుమార్‌ రెడ్డి

అత్యధిక సిక్స్‌ల (రూ. 10 లక్షలు) అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ

అత్యధిక ఫోర్లు అవార్డు (రూ. 10 లక్షలు) అందుకున్న ట్రావిస్ హెడ్

ఫెయిర్ ప్లే అవార్డు (రూ. 10 లక్షలు) గెలుచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి పిచ్, గ్రౌండ్ అవార్డు (రూ. 50 లక్షలు)

Next Story